శ్రీ సిద్ది వినాయక స్వామి దేవాలయం (శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయం), అయినవిల్లి
తొలగించే అయినవిల్లి గణపతి !!కష్టాలు
ఆంధ్రప్రదేశ్‌లో సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఇక్కడ ఆ గణనాధుడు స్వయంభూగా వెలసిన గణపతి క్షేత్రం. కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం పొందింది. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ, అమలాపురానికి 12 కి.మీ దూరంలో వెలసింది. పవిత్ర గోదావరి నది ఒడ్డున, పచ్చని కోనసీమ అందాలు, ప్రకృతి రమణీయతలతో, సుందర ప్రశాంత వాతావరణం ఈ ఆలయం భాసిల్లుతుంది. ఏకదంతుడు ఇక్కడ సిద్ది వినాయకునిగా కొలువై భక్త జనాన్ని అనుగ్రహిస్తున్నారు. అంతేకాదు ఈ వినాయకునికి నారికేళా వినాయకుడు అని కూడా అంటారు. ఒక్క కొబ్బరికాయ కొడితే, కోరిన కోర్కెలు తీర్చే నారికేళా గణనాథుడు నిత్యం పూజలందుకుంటున్నాడు. అంతటి ప్రత్యేక ఆలయం అయిన అయినవిల్లి వినాయకునిపై .వినాయక చవితి సంధర్భంగా ప్రత్యేక కథనం.
jai ganeshayanamaha
ReplyDeleteFirst time vinnanu sir💐💐💐
ReplyDelete