తొలగించే అయినవిల్లి గణపతి !! కష్టాలు స్థలపురాణం ఇతిహాసం ప్రకారం రెండు కథలు ఉన్నాయి. మొదటి కథ ప్రకారం దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని చెబుతారు. స్వయంభువ వినాయకక్షేత్రాలలో ఇది మొదటిదని విశ్వసించబడుతుంది. ఇది కృతయుగానికి చెందినదిగా భావిస్తున్నారు.మరొక కథనం అనుసరించి వ్యాసమహర్షి దక్షిణ భారత దేశ యాత్ర ప్రారంభసమయంలో ఇక్కడ పార్వతి తనయుడైన వినాయకుని ప్రతిష్ఠించాడని ఈ వినాయకుడే భక్తుల కోరికలు తీర్చే సిద్ధి వినాయకుడు అయ్యాడని చెబుతారు. ఆంధ్రప్రదేశ్లో సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఇక్కడ ఆ గణనాధుడు స్వయంభూగా వెలసిన గణపతి క్షేత్రం. కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం పొందింది. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కి.మీ, అమలాపురానికి 12 కి.మీ దూరంలో వెలసింది. పవిత్ర గోదావరి నది ఒడ్డున, పచ్చని కోనసీమ అందాలు, ప్రకృతి రమణీయతలతో, సుందర ప్రశాంత వాతావరణం ఈ ఆలయం భాసిల్లుతుంది. ఏకదంతుడ...
అరుణాచలం దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం లేదా అన్నామలై పంచభూత లింగా క్షేత్రాలలో అగ్ని భూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని.. అచలం అంటే కొండ అని అర్థం. అంటే ఎర్రని కొండ అని భావం. మనం చేసిన రుణ పాపాలను తొలగించునది అని అర్థం అని పండితులు చెబుతారు. అదే తమిళంలో అయితే ‘‘తిరువన్నామలై’’ అంటారు. శివ భక్తులు తిరువాన్నామలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు. తిరు అంటే శ్రీ, అణ్ణామలై అంటే పెద్ద కొండ అని అర్థం. మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి. అరుణాచలం క్షేత్రంలో పగలు, రాత్రి, సంధ్యా సమయం, ఎర్రని ఎండలో.. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ.. చలికి గజ గజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి పద్రక్షిణం చేస్తూనే ఉంటారు. పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్య లోక వాసులు కూడా తిరువాన్నామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ, చీమ, కుక్క, పక్షులు, పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.
Comments
Post a Comment